Vivo X300 Ultra: వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. వివో ఎక్స్ 300 సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఇందులో వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ 200MP జబర్దస్త్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ అప్ కమింగ్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగు పెడుతుందో తెలుసుకుందామా. Survey Thank you for completing the survey! Vivo X300 Ultra: లాంచ్ డేట్ వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మే 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది. ఈ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్టు క్లియర్ చేసింది.

Vivo X300 Ultra: కీలక ఫీచర్స్ వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను కళ్ళు చెదిరే గొప్ప డిజైన్ తో అందిస్తుంది. ఇది ఎక్లిప్స్ బ్లాక్ మరియు విక్టరీ గ్రీన్ రెండు రంగుల్లో వస్తుంది. ఈ ఫోన్ 4.6 GHz క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతుంది. ఇది 3nm న్యూ జనరేషన్ ప్రొసెస్ చిప్ సెట్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా విభాగంలో వివో ఎక్స్ 300 స్మార్ట్ ఫోన్ అల్ట్రా ప్రీమియం సెటప్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో కెమెరా పై భాగంలో పెద్ద రౌండ్ బంప్ లో ఉంటుంది. ఇది ఈ ఫోన్ అందం మరింత పెంచుతుంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో 200MP Sony LYT 901 మెయిన్ కెమెరా, 200MP AF ట్రాకింగ్ టెలిఫోటో కెమెరా మరియు 50MP Sony LYT 818 అల్ట్రా వైడ్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా అద్భుతమైన అవుట్ పుట్ అందిస్తుందని వివో తెలిపింది. ఈ ఫోన్ కెమెరా 120FPS వద్ద స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ అందిస్తుంది. అంతేకాదు, మల్టీ ఫోకల్ 4K 120FPS Dolby Vision వీడియో కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో 60FPS ఆటో ఫోకస్ ట్రాకింగ్ స్నాప్ షాట్ ఫీచర్ కూడా ఉంది. ఈ మొత్తం కెమెరా సెటప్ కి ZEISS ఆప్టిక్స్ మద్దతుగా ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ ను అచ్చంగా DSLR మాదిరిగా రూపాంతరం చెందించే ప్రత్యేకమైన కిట్టు కూడా ఈ ఫోన్ తో లాంచ్ చేస్తుంది. Also Read: Philips అవార్డ్ విన్నింగ్ Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.! ఈ వివో ఫోన్ లేటెస్ట్ ఆరిజిన్ OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఇది 5సంవత్సరాల OS అప్‌డేట్ మరియు 7 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ లను కూడా అందుకుంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా వివో రెగ్యులర్ అప్‌డేట్స్ తో రివీల్ చేసే అవకాశం ఉంటుంది. మరిన్ని కొత్త అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.